తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్‌ శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్‌ శ్రీనివాసరావు

Apr 1 2026 10:59 AM | Updated on Apr 1 2026 10:59 AM

శ్రీశైలం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా శ్రీశైలంలో తెలుగు వర్సిటీ పీఠాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ ముసుగు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయు డు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలుగు వర్సిటీ నుంచి ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసిన ఆయన తన పర్యవేక్షణలో ఎనిమిది మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాలు పొందగా, 17 మంది విద్యార్థులు తమ పరిశోధనలు పూర్తి చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement