వసతి గదిలో ఇద్దరు యువకులు, ఓ యువతి | - | Sakshi
Sakshi News home page

వసతి గదిలో ఇద్దరు యువకులు, ఓ యువతి

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

పొంతన లేని సమాధానాలతో పోలీసుస్టేషన్‌కు తరలింపు

పెళ్లి విషయం తేల్చుకునేందుకని బుకాయింపు

దేవస్థానం ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహారం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైలం దేవస్థాన వసతి గదిలో అనుమానాస్పదంగా ఇద్దరు యువకులు, ఒక యువతి ఉండడం, వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతానికి చెందిన ఓ యువతితో దేవస్థానంలో హౌస్‌కీపింగ్‌ నిర్వహణ చేపడుతున్న పద్మావతి ఏజెన్సీ సూపర్‌వైజర్‌, శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ఇంచార్జ్‌ సీఎస్‌వో తన సిబ్బందితో దాడులు నిర్వహించగా రెడ్‌హ్యండెడ్‌గా ఇద్దరు యువకులు, ఒక యువతిని గుర్తించారు. వారిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో శ్రీశైలం పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అసలేం జరిగిందంటే..

శ్రీశైలం దేవస్థానంలోని సిద్దిరామప్ప వాణిజ్య సముదాయంలో భక్తుల సౌకర్యార్థం వసతి గదులను నిర్మించారు. మార్చి 29న నరేంద్రారెడ్డి పేరుతో భార్య, భర్త విడిది చేశారు. వీరు మంగళవారం ఉదయం 10.30గంటలకు వసతి విభాగాన్ని ఖాళీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పద్మావతి ఏజెన్సీ సూపర్‌వైజర్‌తో రసీదుపై సంతకం చేయించుకున్నారు. అనంతరం దేవస్థానం సెంట్రల్‌ రిసెప్షన్‌ ఆఫీసులో రసీదు చూపిస్తే వారికి రావాల్సిన అడ్వాన్స్‌ డబ్బులు తిరిగి ఇచ్చి, రూము ఖాళీ అయినట్లు నమోదు చేసుకుంటారు. అయితే వారికి ఇవ్వాల్సిన అడ్వాన్స్‌ డబ్బులు అక్కడ విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్‌ ఇచ్చి పంపించేశాడు. అనంతరం ఓ యువతితో ఎ–3 వసతి గదిలో తన సన్నిహితుడైన శ్రీశైలానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నారు.

పెళ్లి సంగతి తేల్చుకోవాలనట!

శ్రీశైలం పోలీసు స్టేషన్‌లో యువతి, యువకులను విచారించారు. పద్మావతి ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న సాయికృష్ణ, గదిలో ఉన్న యువతి బంధువులు అవుతారని.. వాళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని తెలిసింది. అయితే సాయికృష్ణ ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తుండడంతో విషయం తెలుసుకున్న యువతి సాయికృష్ణతో పెళ్ళి విషయం మాట్లాడి వస్తానని తల్లికి చెప్పి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం.

అర్హత లేని వ్యక్తికి వసతి విభాగం బాధ్యతలు

శ్రీశైలం దేవస్థానంలో ఆయా విభాగాలకు అధిపతులుగా (సహాయ కార్యనిర్వహణాధికారి) ఏఈవోలను నియమిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని ఎలాంటి అర్హత లేకపోయినా వసతి విభాగం ఏఈవోగా దేవస్థానం పీఆర్వో బాధ్యతలు చేపట్టారు. ఆ విభాగంపై పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ వసతి విభాగంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది.

వీరిలో పద్మావతి ఏజెన్సీ సూపర్‌వైజర్‌, మరో వ్యక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement