ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన ఏసు | - | Sakshi
Sakshi News home page

ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన ఏసు

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

నంద్యాల(న్యూటౌన్‌): మానవుల్లో ప్రేమతత్వాన్ని మేల్కొల్పిన మహానీయులు ఏసుక్రీస్తు అని నంద్యాల డయాసిస్‌ పీఠాధిపతులు బిషప్‌ ది రైట్‌ రెవరెండ్‌ సంతోష్‌ ప్రసన్నరావు అన్నారు. మట్టల ఆదివారం సందర్భంగా పట్టణంలోని హోలీక్రాస్‌ కెథడ్రల్‌ పాస్టరేట్‌–2 ఆల్‌ సెయింట్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీనరీ చైర్మన్‌ ఎంఐడీ ప్రసాద్‌ గురువులు, డేవిడ్‌ వేణు, రెవరెండ్‌ మారడోన గురువులతో పాటు పాస్టరేట్‌–3లో డీనరీ చైర్మన్‌ సామేలు రత్నరాజు గురువులతో పాటు పాస్టరేట్‌–4, 5, 6లో రెవరెండ్‌ విక్టర్‌ బాబులతో పాటు కమిటీ సభ్యులు, క్రైస్తవ పెద్దలు, చిన్నా, పెద్దలు, మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. మట్టలు చేతపట్టుకొని దేవున్ని స్తుతిస్తూ ప్రత్యేక పాటలు పాడుతూ ఆలయాల చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు చేశారు. ఈ రోజు నుంచి గుడ్‌ఫ్రైడే వరకు ఏసు అనుభవించిన శ్రమలను ప్రతి రోజూ ధ్యానిస్తూ మంచి మార్గంలో నడవాలని సూచించారు. అందరూ శాంతి సమాధానం కలిగి ఏసు మార్గం జీవించాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు విజయ్‌కుమార్‌, టెక్కె పాస్టరేట్‌ చైర్మన్‌ జోయల్‌బాబు, పాల్‌రాజారావు, సీయెను ప్రార్థనామందిరం నిర్వాహకులు ఏసుదాసు, ఏసుకృప పాస్టర్‌ అందం సుధాకర్‌, జాన్‌బెన్నిలతో పాటు అన్ని సంఘాల పాస్టర్లు ఆయా సంఘాల్లో మట్టల ఆదివారం సందేశాన్ని వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement