యువకుడి దారుణహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Mar 29 2026 6:53 AM | Updated on Mar 29 2026 6:53 AM

సి.బెళగల్‌: పాత కక్షలతో కె.సింగవరం గ్రామంలో ఓ యువడిని శనివారం దారుణంగా హత్య చేశారు. ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ మల్లికార్జున (27)కు అదే గ్రామానికి చెందిన కొందరి వ్యక్తుల మధ్య గొడవలు ఉన్నాయి. వారు శనివారం ఘర్షణ పడి బోయ మల్లికార్జునను చేతులు, కాళ్లతో కొట్టడమే గాక వేటకొడవలితో కుడి కాలును నరికారు. తీవ్ర రక్తస్రావమై బోయ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement