మోంథా తుపాన్‌తో
దెబ్బతిన్న పంటల వివరాలు
ఎకరా రూ. 35 వేలు వెచ్చించి ఎకరన్నర పొలంతోపాటు నాలుగున్నర ఎకరాల సొంత పొలంలో ఖరీఫ్ సీజన్‌లో మిరప పంట సాగు చేశాను. నారు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో అక్టోబర్ ఆఖరు నాటికి ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించాను. భారీ వర్షాలు కురిసి అధిక తేమతో మొక్కలు చనిపోవడంతో నాలుగు ఎకరాల్లో మిరప పైరును తొలగించాను. మిగిలిన రెండు ఎకరాల్లో మిరప అరకొరగా ఉంది. తుపాన్ కారణంగా మిరప సాగుతో భారీ నష్టాలు వచ్చాయి.
– రమణారెడ్డి, రైతు,
చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం
మోంథా తుపాన్ కారణంగా గతేడాది అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు మినుము, కంది పంటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ. 35 వేలు ఖర్చు చేసి పది ఎకరా ల్లో మినుము సాగు చేశాను. భారీ వర్షాలు తర్వాత పొగమంచుతో పూత, పిందె రాలిపోయి నష్టం వాటిల్లింది. కందిపూత దశలో వర్షాలు కురియడంతో నష్టాలు తప్పలేదు. పంటనష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – వెంకటేశ్వరరెడ్డి, రైతు,
కంపమల్ల, కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: రైతులకు అడుగడుగునా సాయమందించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మోంథా తుపాన్‌తో గతేడాది అక్టోబర్‌లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందలేదు. అప్పుల బాధతో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో గతేడాది ఖరీఫ్ సీజన్‌లో 76,672 హెక్టార్లలో వరి, 76,025 హెక్టార్లలో మొక్కజొన్న, 35,713 హెక్టార్లలో కంది, 12,011 హెక్టార్లలో మిను ము, 7,581 హెక్టార్లలో వేరుశనగ, 6,426 హెక్టార్లలో పత్తి, 6,786 హెక్టార్ల మిరప పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌లో 53,801 హెక్టార్లలో పప్పుశనగ, 29,395 హెక్టార్లలో జొన్న, 29,413 హెక్టార్లలో మొక్కజొన్న 11,643 హెక్టార్లలో మినుము పంటలు సాగయ్యాయి. తుపాన్ ప్రభావంతో వారం రోజులపాటు భారీ వర్షా లు కురవడంతో రైతులకు పంటలు చేతికందలేదు.
నష్టం ఇలా..
వరి, మొక్కజొన్న, కంది, మినుము పంటల సాగుకు ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఖర్చు వచ్చింది. మిరప సాగుకు ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. పప్పుశనగ, జొన్న, త దితర పంటల్లో ఎకరాకు రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వరుస వర్షాలతో కంది, మినుములో పూత, పిందె రాలిపోయి నష్టం చేకూరింది. మిరపలో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయింది. చాలాచోట్ల మిరప పైరును తొలగించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి కోత దశలో భారీ వ ర్షాలతో నేలివాలి పనికిరాకుండా పోయింది. కల్లాల్లో ఆరబోసినదిగుబడులు తడిచిపోవడంతో రైతులు నష్టా లు మూటగట్టుకున్నారు.రబీసీజన్‌లో జిల్లాలో రై తులు విస్తారంగా పప్పుశనగ, జొన్న పంటలు సాగు చే శారు. విత్తనం వేసిన నెల రోజులకే భారీ వర్షాలు కు రి యడ ంతోపొలాల్లో నీరునిల్వ చేరి మొక్కలు చనిపోయాయి. రైతులు తిరిగి విత్తనం వేసుకోవాల్సి వచ్చింది.
ఐదు నెలలుగా ఎదురు చూపులు
మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 22,554 మంది రైతులకు సంబంధించి వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు. నష్టపరిహారం విడుదలకు ప్రతిపాదనలు పంపారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు వరి, వేరుశనగ పంటలకు హెక్టారుకు రూ. 25 వేలు, మినుము, కంది పంటలకు రూ. 15వేలు, మిరపకు రూ. 35వేల చొప్పున నష్టపరిహారం అందాల్సి ఉంది. పంటనష్ట సంభవించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహార ఊసే లేకపోవడంతోరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నియోజకవర్గం దెబ్బతిన్న విస్తీర్ణం
(హెక్టార్లలో)
బనగానపల్లె 1181
శ్రీశైలం 4075
ఆళ్లగడ్డ 2960
నందికొట్కూరు 2015
నంద్యాల 898
పాణ్యం 452
(పాణ్యం, గడివేముల)
వైఎస్సార్‌సీపీ హయాంలో అదే సీజన్‌లో అందిన పరిహారం
ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం సంభవిస్తే అదే సీజన్‌లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది. నంద్యాల జిల్లాలో 2021వ సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటనష్టం సంభవించగా 89,199 మంది రైతులకు రూ. 84.33కోట్లు, 2022వ సంవత్సరంలో 49,637 మంది రైతులకు దాదాపు రూ. 100 కోట్లను ఇన్సూరెన్స్ రూపంలో అందించి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా రైతులకు నిలిచింది.
ముంచిన మోంథా తుపాన్
దెబ్బతిన్న మిరప, కంది,
మినుము, వరి పంటలు
జిల్లాలో నష్టపోయిన రైతులు
22,554 మంది
మొత్తం 11,581 హెక్టార్లలో పంటనష్టం
ఇప్పటి వరకు పరిహారం ఇవ్వని
చంద్రబాబు సర్కార్


