అవుకు(కొలిమిగుండ్ల): ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కేసులో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి ఎస్‌ఐ అశోక్‌తో కలిసి నిందితుడి వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవుకు పట్టణంలోని కోటవీధికి చెందిన పోతుల శేఖర్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు రామాంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇంటిని తన పేరున రాయించాలని తరచూ తల్లితండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈక్రమంలోనే ఈనెల 19న ఉగాది పండుగ రోజున ఆస్తి విషయంలో గొడవకు దిగాడు. తల్లిదండ్రులను చంపాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న రాయితో తండ్రిపై దాడి చేయడంతో కింద పడగా కట్టెతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డుకోబోయిన తల్లి లక్ష్మీదేవిని అదే కట్టెతో బలంగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందింది. ఈ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. నిందితుడు రామాంజనేయులు కోసం వెతుకుతుండగా మెట్టుపల్లి రోడ్డులోని చిన్న చెరువు కట్ట సమీపంలో ఉన్న విషయం తెలుసుకొని అరెస్ట్ చేశాని సీఐ తెలిపారు.
జల్సాకు అలవాటు పడి..
తల్లిని హత్య చేసిన నిందితుడు రామాంజనేయులు చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటు పడి ఊర్లో చెడు వ్యక్తులతో సావాసం చేస్తూ మద్యానికి బానిస య్యాడు. జల్సాల కోసం పలువురి దగ్గర డబ్బులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు, జల్సాలకు ఇంట్లో డబ్బులు అడిగితే తల్లిదండ్రులు నిరాకరించా రు. ఎలా గైనా అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో కొంత మందితో కలిసి 2023లో రామాపురంలో చోరీకి పాల్పడ్డాడు. ఆ డబ్బులతో కొంత అప్పులు చెల్లించి మిగిలిన డబ్బుల ను జల్సాలకు వాడుకున్నాడు. ఈ దొంగతనం కేసులో అవుకు పోలీస్ స్టేషన్‌లో అప్ప ట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా అప్పులు చేయడం, జల్సాలు మానుకోలేదు. డబ్బుల కోసం తల్లిదండ్రులను కొన్ని నెలల నుంచి ఇబ్బంది పెడు తున్నా వాళ్లు ఇవ్వలేదు. వారి పేరున ఉన్న ఆస్తి రాసివ్వలేదనే కారణంతో తల్లిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.


