నందవరం: ఆర్టీసీ బస్సు అదు పు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. నందవరం గ్రామ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నాగలదిన్నె నుంచి ఆర్టీసీ బస్సు ఎమ్మిగనూరుకు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది. నందవరం గ్రామం దాటిన తరువాత బస్సు స్టీరింగ్ వీల్ పనిచేయకపోవడంతో డ్రై వర్ కాశీం పొలాల్లోకి మళ్లించాడు. ప్రధాన రహదారిలో చింత చెట్టు స్వల్పంగా ఢీకొని బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాలం చెల్లిన బస్సులు నడుపుడుతుడడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు మండిపడ్డారు. ప్రభుత్వం కండిషన్ కలిగిన బస్సులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.


