శ్రీశైలం
టెంపుల్: శ్రీశైల దేవస్ధానంలో ఆదివారం స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో సర్కారీ సేవగా) నిర్వహిస్తారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేపట్టారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు.


