మహానందికి బయలుదేరిన పెళ్లి పెద్ద
నంద్యాల(వ్యవసాయం): మహానంది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శివరాత్రి జరిగే కళ్యాణానికి ఆహ్వానంగా వచ్చిన శ్రీకామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారితో పెళ్ళి పెద్ద అయిన శ్రీ గంగా పార్వతీ సమేత బ్రహ్మనందీశ్వరస్వామి గురువారం మహానందికి బయలుదేరారు. ఈ సందర్భంగా బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవమూర్తులకు ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. పట్టణంలోని కల్పనా సెంటర్‌లోని శ్రీకాశిరెడ్డినాయన ఆశ్రమం వారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు, మహానంది దేవస్థాన సిబ్బందికి అన్న దానం చేశారు. ఆలయ ఈఓ లక్ష్మీనారాయణ, ఈశ్వరరెడ్డి, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


