ఇతరులకు శ్వాస ఇచ్చిన పావనీలత
కర్నూలుకు చెందిన పావనీలతకు నాలుగేళ్ల క్రితం భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నీ సమస్యతో మృతి చెందాడు.. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఆమె హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ ప్రయత్నాల్లో ఉండగా గత సంవత్సరం ఫిబ్రవరి 2న ఫిట్స్ రావడంతో మెదడు దెబ్బతినింది. ఆ మరుసటి రోజు ఆమెను కుటుంబసభ్యులు తీసుకొచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు కాలేయాన్ని, కిడ్నీలను, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు పంపించారు.


