రాక్‌గార్డెన్‌లో సినిమా షూటింగ్
ఓర్వకల్లు: మండల కేంద్రం ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్ (రాతివనం)లో బుధవారం సినిమా చిత్రీకరణ సందడి నెలకొంది. మెమోరి మేకర్స్ ప్రొడక్షన్ ఆధ్వర్వంలో రవికుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తెలుగు సినిమా షూటింగ్‌ను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు యూనిట్ బృందం సభ్యులు తెలిపారు. అవినాస్, కబీర్ సింగ్, బెహర ప్రసాద్, ఆకాష్, స్నేహ హీరో, హీరోయిన్లతో మొదటి రోజు ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చిత్ర బృందం తెలిపారు. టార్జాన్, ప్రకాష్ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం సభ్యులు పేర్కొన్నారు.


