భాగస్వాములు కావాలి
కర్నూలు(సెంట్రల్): ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. బుధ వారం వర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ 4, 5 యూనిట్లు పి.రుద్రవరం, నూతనపల్లె గ్రామా ల్లో ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. వారం రోజులపాటు గ్రామీ ణులతో మమేకం అయ్యి వారి సామాజిక రుగ్మతలను తెలుసుకోవాలని, మూఢ నమ్మకాలను వీడేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగచంద్రుడు, బీవీ శివప్రసాద రెడ్డిని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్‌నాయుడు అభినందించారు.


