ఉచితంగా టెలికం నైపుణ్య శిక్షణా కోర్సులు
కర్నూలు(హాస్పిటల్): ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, డిప్లొమా ఫైనలియర్ విద్యార్థులకు ఉచిత టెలికం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ప్రారంభించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకం కింద ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. వైర్‌లెస్ టెక్నీషియన్, బ్రాడ్‌బాండ్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ స్ప్లైసర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కోర్సులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్, హ్యాండ్స్ ఆన్ శిక్షణను అందించడంతో పాటు ఉద్యోగ నియామక సహాయం కూడా కల్పిస్తాయన్నారు. శిక్షణా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.rttchyd.bsnl. co.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 19వ తేది ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆర్‌టీటీసీ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరు కావాలని పేర్కొన్నారు.
గుడ్డు చిన్నదైంది!
పాములపాడు: సాధరణంగా కోడి గుడ్డు 40 నుంచి 45 గ్రాముల వరకు బరువు ఉంటుంది. పాములపాడుకు చెందిన బోగాల శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో కోడిపెట్ట బుధవారం అతి చిన్న సైజులో గుడ్డు పెట్టింది. దాని బరువు 10గ్రాములు మాత్రమే ఉంది. జన్యులోపం కారణంగానే ఇలా చిన్న సైజు గుడ్లను అరుదుగా కోళ్లు పెడుతుంటాయని పశు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు.
రైల్లో నుంచి జారిపడి
వ్యక్తి మృతి
ఆదోని సెంట్రల్: రైల్లో నుంచి కిందకు దిగే సమయంలో జారి పడి ఓ వ్య క్తి మృతి చెందాడు. ఆదో ని డివిజన్ పరిధిలోని మంత్రాలయం రైల్వే స్టేష న్లో ప్లాట్‌ఫామ్ నంబర్. 2 వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో జీఆర్‌పీ, అర్‌పీఎఫ్ సిబ్బంది స్పందించి 108 అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు రైల్వే పోలీ సు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడి పేరు దేవేంద్ర (40)అని, ఆధార్‌కార్డులో అడ్రస్ కర్టాటక రాష్ట్రం యాదగిరిలోని శా హపుర గ్రామం అని ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నేడు కోవెలకుంట్లలో విద్యుత్ అదాలత్
నంద్యాల(అర్బన్): విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు గురువారం కోవెలకుంట్ల పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ నంద్యాల డివిజన్ ఈఈ శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి రిటైర్డు జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అతిథిగా హాజరవుతుండగా స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, మధుకుమార్ పాల్గొంటారన్నారు. దీర్ఘకాలిక సమస్యలున్న విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదుల ద్వారా తెలియపరిస్తే పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉచితంగా టెలికం నైపుణ్య శిక్షణా కోర్సులు


