సీనియర్ అసిస్టెంట్లుగా 35 మందికి పదోన్నతి
కర్నూలు (అర్బన్) : జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 మంది జూని యర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతులు పొందిన వారికి బుధవారం సాయంత్రం జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పంచాయతీరాజ్ కార్యాలయాలకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ పదోన్నతి పొందిన వారందరూ ఆయా కార్యాలయాల్లో విధులు సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఇ.వి. సుబ్బారెడ్డి, జెడ్పీలోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


