వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
జూపాడుబంగ్లా: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండ్లెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా హాజరుపట్టికను పరిశీలించగా ఓ ఉపాధ్యాయులు గైర్హాజరై ఉండటంతో ఉపాధ్యాయులు విధుల పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్ణీత సమ యంలో సిలబస్ పూర్తి చేశారా?.. లేదా? అని ఆరా తీశారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ అమ లు చేస్తున్నారా.. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారా.. అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వెనుకబడిన విద్యార్థులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. కొందరు విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివించి వారి ప్రతిభను పరిశీలించారు. ఈయన వెంటన ఎంఈఓ చిన్నమద్దిలేటి ఉన్నారు.
అమ్మవారి ఆలయ
పర్యవేక్షకుడి సస్పెన్షన్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబా దేవి ఆలయంలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న డి. మల్లికార్జునుడిని దేవస్థాన ఈఓ ఎం. శ్రీనివాసరావు సస్పెండ్ చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం బయటికి వెళ్లే భక్తులకు అమ్మ వారి ఆలయం వెనుక భాగంలో ప్రతి రోజు దేవస్థానం ఉచిత ప్రసా దం పంపిణీ చేస్తోంది. అయితే గత రెండు రోజుల క్రితం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈఓ ఆగ్ర హం వ్యక్తం చేస్తూ.. సంబంధిత పర్యవేక్షకులు డి. మల్లికార్జునుడిని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో పర్యవేక్షకులుగా శ్రీగిరి శ్రీనివాస రెడ్డిని నియమించారు.


