రేపు యాగంటిలో కల్యాణం
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో ఈ నెల 18వ తేదీన మాసశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి మంగళవారం తెలిపారు. స్వామి అమ్మవార్ల కల్యాణంలో పాల్గొనే భక్తులు గురువారం సాయంత్రం 6 గంటల్లోగా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
విద్యుత్ వృథాను అరికడదాం
నంద్యాల(అర్బన్): విద్యుత్ వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధాకర్ కుమార్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ‘ఇంధనం పొదుపు చేద్దాం.. భావి తరాలకు వెలుగునిద్దాం’ అంటూ అధికారులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్‌లో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలంద రూ ఇంధనాన్ని పొదుపు చేయాలని, విద్యుత్ పొదుపు సంబంధించిన చిట్కాలను పాటించాలన్నారు. విద్యు త్ ఆదా, అవసరం, వనరుల పరిరక్షణ గురించి ప్రజ ల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలు చేపడుతున్నామన్నారు.


