అప్పుల బాధతో..
కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి నిప్పుఅంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ జయశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన ఎర్వ. దేవదాసు (41) అనే వ్యక్తి ఆరోగ్యసమస్యల వల్ల వైద్య ఖర్చులకు అప్పులు చేశాడు. దీనికి తోడు తాగుడుకు బాసిసయ్యాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు పొలానికి వెళ్లిన తర్వాత నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే పూర్తిగా కాలిపోయి చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ద్వారా సమాచారం అందుకున్న ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడికి భార్య యేసమ్మతోపాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు.


