రండి బాబూ రండి..
ప్రతి వ్యాపారంలో పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించాలంటే అంత సులువు కాదు. అందుకే వీరు ఏకంగా తమ వ్యాపారాన్ని కొనుగోలుదారుల వద్దకు చేర్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ, నరసింహులు కుటుంబాలు స్వచ్ఛమైన పసుపు అంటూ... ఆటోల్లో బయలుదేరారు. రైతుల నుంచి సేకరించిన పసుపు కొమ్ములను ప్రజల ఎదుటే మరలో ఆడించి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మార్కెట్‌లో కేజీ ధర రూ.200 ఉండగా వీరి వద్ద నాణ్యతగా ఉండటంతో కేజీ రూ. 300 మేర విక్రయిస్తున్నారు. రండి బాబూ రండి.. ఇది పసుపు బండి అంటూ ఊరూరా తిరుగుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. – బేతంచెర్ల


