వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
దెబ్బతిన్న కారు,చికిత్స పొందుతున్న కన్నయ్య
పాణ్యం: మండల పరిధిలోని జాతీయ రహదారిపై వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గా యాలయ్యాయి. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దూటూరు చెందిన టీఎస్ 11యూడీ 1079 నంబర్ గల కారు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా పాణ్యం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమా దం జరిగిన వెంటనే అతను పరారయ్యాడు. కారులో ఇతరుల్వెరు లేరని, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి తిరుపతికి శ్రీ వెంకటేశ్వరస్వామి మాల ధరించి కాలినడకన వెళ్తున్న ముగ్గురిని వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఈ ఘటనలో భక్తులు కన్నయ్య, లక్ష్మీ, లక్ష్మీనారాయణమ్మతో పాటు ద్విచక్రవాహనదారుడు రమేష్ అనే వ్యక్తికి కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. భక్తుల స్వగ్రామం విజయనగరం కాగా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మొక్కు ఉండడంతో తిరుమలకు కాలినడకన వెళ్తున్నట్లు వెల్లడించారు.
నెరవాడ మెట్ట వద్ద డోన్‌కు చెందిన శేఖర్, రాజమ్మ బైక్‌పై ఆర్‌జీఎం కాలేజీలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్తున్నారు. సర్వీస్ రోడ్డులో వడ్లు ఆరబోసిన వ్యక్తులు పట్టలపై రాళ్లు ఉంచారు. బైక్‌పై వెళ్తుండగా అవి తగలడంతో అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో దంపతులకు గాయాలు కాగా 108 వాహనంలో నంద్యాల జీజీహెచ్‌కు తరలించినట్లు సిబ్బంది చంద్రశేఖర్, ప్రకాష్ తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు


