ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో అవకతవకలపై విచారణ
నంద్యాల(అర్బన్): ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగుల జీతభత్యాల్లో చోటు చేసు కున్న అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఆరోగ్య శాఖకు సంబంధించి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గత ఐదేళ్ల జీతభత్యాలకు సంబంధించి రూ.1.5 కోట్ల అవకతవకలు జరిగినట్లు సమాచారం. జిల్లా ట్రెజరీలో పని చేస్తున్న సీనియర్ అకౌంటెంట్, ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో పని చేస్తున్న సీనియర్ అకౌంటెంట్‌లు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రస్తుతం జమ్మలమడుగు పీహెచ్‌సీలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ట్రెజరీలో పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక రిటైర్డు ఉద్యోగి, సీనియర్ అకౌంటెంట్, ఒక ఎస్‌టీఓను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. సబ్ ట్రెజరీలో ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరగపడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ లక్ష్మీదేవిని ఫోన్‌లో సంప్రదించగా ఎటువంటి సమాధానం రాలేదు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరు కుని స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయా యి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆల యం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
గంజాయి స్మగ్లర్ల అరెస్టు
● మూడు కేజీల గంజాయి స్వాధీనం
ఆత్మకూరురూరల్: గంజాయి సరఫరా చేసే ఇద్దరు స్మగ్లర్లను ఆత్మకూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 వేల విలువ చేసే మూడు కేజీల గంజాయిని స్వాధీ న పరుచుకున్నారు. ఆత్మకూరు ఎస్‌డీపీవో రామాంజినాయక్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు తెలిపారు. కొత్తపల్లె మండల కేంద్రానికి చెందిన కేతె పుల్లయ్య జీవనోపాధి నిమిత్తం జేసీబీ ఆపరేటర్‌గా ఒడిశాలో పని చేసేవాడు. కొత్తపల్లె మండలం గువ్వలకుంట్లకు చెందిన శ్రీరాములుతో పరిచయం పెంచుకుని తెలంగాణా కొల్లాపురం మండలం సోమశిలకు చెందిన తిరుపాలుతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వచ్చి గంజాయి వ్యసన పరులకు అమ్మేవారు. ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన కిశోర్ నుంచి ఈ ముఠా కేజీ రూ.9500కు కొనుగోలు చేసి కిలో రూ. 19వేల చొప్పున అమ్మేవారు. సమాచారం అందడంతో ఆత్మకూరు అర్బన్ సీఐ తన సిబ్బందితో వల పన్ని ఆత్మకూరు సమీపంలో కేతె పుల్లయ్య, శ్రీరాములులను అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కర్నూలు (హాస్పిటల్): ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశా రు. పోలీసు అధికారులకు వాహనదారులు రహ దారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్‌స్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. బైక్‌లు నడిపేవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని, తదితర రోడ్డు భద్రత ప్రా ముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో అవకతవకలపై విచారణ


