ఒకే రోడ్డుకు రెండు శాఖల నిధులు
జూపాడుబంగ్లా: గ్రామీణ రహదారులు గుంతలమయమై వాహనదారులు అవస్థలు పడుతున్నా కనీసం ప్యాచ్ వర్క్‌లు చేపట్టడం లేదు. కొన్ని రహదారులు అధ్వానంగా ఉండటంతో బస్సు సర్వీసులు రద్దైన గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రోడ్డు అభివృద్ధికి రెండు శాఖల నుంచి నిధులు మంజూరు కావడం అధికారుల అవగాహన లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది. 80 బన్నూరు–చాబోలు వరకు ఉన్న 5.029 కిలోమీటర్ల రోడ్డు ఏశాఖ పరిధిలో ఉందన్న విషయంపై పంచాయతీరాజ్‌శాఖ, జలవనరులశాఖ అధికారుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో ఒకే రోడ్డుకు రెండుశాఖలు ప్రతిపాదనలు పంపించటంతో చంద్రబాబు సర్కార్ రెండుశాఖలకు నిధు లు మంజూరు చేయటం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్కడికి వెళ్లాలంటే ఎన్‌హెచ్ 340సీ రోడ్డు మీదుగా 80 బన్నూరు గ్రామం వద్దకు వెళ్లి అక్కడి నుంచి పోతులపాడు, చాబోలు గ్రామాల మీదుగా ప్రయాణించాలి. 1985లో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నిర్మించగా అక్కడికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మొదట్లో పంచాయతీరాజ్‌శాఖ అధ్వర్యంలో ఉండేది. క్రమేణా ఆ రోడ్డును జలవనరులశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని వారి అధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల క్రితం సుమారు రూ.1,300 కోట్లతో పీఎన్‌సీ కంపెనీ వారు పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు ఎస్సారెమ్సీ కాల్వ విస్తరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా 80 బన్నూరు నుంచి చాబోలు వరకు బీటీరోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.4 కోట్ల నిధులను కేటాయించారు. అయినా ఇంత వరకు పనులు చేపట్టలేదు. విస్తరణ పనుల కోసం హెవీలోడ్ (సుమారు 40 టన్నుల) సామర్థ్యంతో టిప్పుర్లు తిరగటంతో రోడ్డుకాస్త చిధ్రౖ మె అడుగు అడుగునా గుంతలమయమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఈ రోడ్డు నిర్మాణానికి రూ.2.53 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఒకే రోడ్డుకు రెండుశాఖల నుంచి నిధులు మంజూరు కావడంపై చర్చనీయాంశమైంది.
అయోమయంలో అధికారులు..
జలవనరులశాఖ అధ్వర్యంలో ఉన్న 80బన్నూరు–చాబోలు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్‌శాఖ(పీఐయు) అధ్వర్యంలో రూ.2.59 కోట్ల నిధులు మంజూరు చేయటంతో జలవనరులశాఖ అధికారులు అవాక్కవుతున్నారు. తమశాఖ ఆధీనంలో ఉన్న రోడ్డుకు పంచాయతీరాజ్‌శాఖ తరుపున నిధులు ఎలా మంజూరుచేస్తారని పేర్కొంటున్నారు. అయితే పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు 80బన్నూరు–చాబోలు రోడ్డు జలవనరులశాఖ ఆధీనంలో ఉన్నట్లు తెలియక రోడ్లు ఉంటే పంచాయతీరాజ్‌శాఖ లేదా ఆర్‌అండ్‌బీ అధ్వర్యంలో ఉంటాయని పేర్కొనటాన్ని చూస్తే కనీసం ఏ రోడ్డు ఏశాఖ పరిధిలో ఉన్నట్లు కూడా తెలుసుకొన్నట్లు లేరనే విషయం అవగతమవుతుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్‌శాఖ(పీఐయూ) డీఈ హరిదాస్ ఈరన్నను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
80 బన్నూరు–చాబోలు రోడ్డుకు
రూ.2.53 కోట్ల నిధులు మంజూరు
ఇరిగేషన్ అధ్వర్యంలో ఉన్న రోడ్డుకు
పంచాయతీరాజ్‌శాఖ నిధులు
పోతిరెడ్డిపాడు విస్తరణ పనుల్లో
ఇప్పటికే రోడ్డుకు రూ.4 కోట్లు మంజూరు


