మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి
పాములపాడు: ప్రజలను నమ్మించి మోసం చేయ డంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందన్నా రు. పక్కనున్న తెలంగాణలో మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని వివరించారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభు త్వం పథకాల అమలులో ఆపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఎప్పుడో పట్టుకున్న ఎర్రచందనం దుంగల వద్దకు వెళ్లి సీజ్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఏడాదిన్నరకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి..
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడినా ఎవరూ వెనకడుగు వేయొద్దని, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పోటీలో నిలిచే పార్టీ మద్దతుదారుల విజయానికి కృషి చేద్దామన్నారు. సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ నాగరాజు, కో ఆప్టెడ్ ముర్తుజాఅలీ, ఎంపీటీసీ సురేష్, సొసైటీ మాజీ చైర్మన్లు గడ్డం క్రిష్ణారెడ్డి, వెంకటస్వామి, నాయకులు కృష్ణారెడ్డి, యుగంధర్‌రెడ్డి, చలమారెడ్డి, ప్రభాకరరెడ్డి, బాలునాయక్, మహానందిరెడ్డి, జబ్బార్, ఉశేన్, కోటి నాయక్, ఓబన్నగౌడు పాల్గొన్నారు.


