కదంతొక్కిన అంగన్‌వాడీలు
నంద్యాల(న్యూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు కదంతొక్కారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అలాగే జాతీయ రహదారిపై గంట సేపు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఏఐటీయూసీ అంగన్‌వాడీ నాయకురాలు జులేకాబీ, సీఐటీయూ అంగన్‌వాడీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శోభారా ణి, నిర్మల తదితరులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, ఫ్రీ స్కూల్‌ను బలోపేతం చేసి ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలతో తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాలవెంకట్, లక్ష్మణ్, మహమ్మద్‌గౌస్, నిర్మలమ్మ, రమణమ్మ, నాగరాణి, మంజుల, హరిత, శివలక్ష్మి, ఏఐటీయూసీ నాయకురాలు సుజాత, సీతామహా లక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


