రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాములపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మ కూరుపట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు కర్నూలు జిల్లా హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాములపాడు మండలంలోని భానుముక్కల టర్నింగ్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వారు యువకుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా, ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


