రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి
కొలిమిగుండ్ల: ఎస్సీ, ఎస్టీలు మరింత చైతన్యవంతులై రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని జైభీమ్‌రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్‌కుమార్ అన్నా రు. కొలిమిగుండ్ల కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వంకదారి చిన్నచెన్నప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వటాల సమీపంలో ఏర్పాటైన రామ్‌కో సిమెంట్ కంపెనీ ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. భూములను రక్షించేందుకు హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకదారి రవికుమార్, జైభీమ్ పార్టీ నాయకులు,కల్వటాల గ్రామ పెద్దలు కామిని ప్రతాప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సొమ్ముతో పవన్ చక్కర్లు
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజా సొమ్ముతో హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని జడా శ్రవణ్‌కుమార్ మండిపడ్డారు. షూటింగ్‌లు, ఫంక్షన్ లు అంటూ రోజూ విజయవాడ – హైదరాబాదు కు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నారన్నారు. సొంత డబ్బులతో హెలికాప్టర్లలో ఎన్ని సార్లు తిరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదని హితువు పలికారు.


