డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఉప్పర కాలనీలో శుక్రవారం సాయంత్రం డిగ్రీ విద్యార్థి సంపత్(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు..కాలనీకి చెందిన శ్రీనివాసులు, మీనాక్షిలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మీనాక్షి ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సంపత్(19) మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులను సినిమాకు పంపించి ఇంట్లో ఉన్నాడు. తల్లిదండ్రులు సినిమా చూసి సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపులు వేసివుండటంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతున్నాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయటంతో ఇంటి పక్కన వారు వచ్చి సంపత్‌ను కిందకు దించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వాసుపత్రికి వచ్చేలోపు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డిగ్రీలో కూడా అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అయితే తనకు తలనొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సంతప్(19) సూపైడ్ నోట్‌ను పెన్సిల్‌తో వ్రాసి జేబులో పెట్టుకున్నాడు. కిందకు దించేటప్పుడు కుటుంబ సభ్యులు ఈ లెటర్‌ను జేబులో నుంచి బయటకు తీసుకొని చూసి బోరన విలిపించారు. తలనొప్పి ఉందని ఇంత వరకు ఒక్కమాట కూడ మాకు చెప్పలేదని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.


