గుడ్డుకు ‘గడ్డు’ కాలం
● డజన్ రూ. వందకు పైనే..
నంద్యాల(అర్బన్): రోజుకో గుడ్డు తింటే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని వైద్యులు అంటున్నా రు. ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో గుడ్లు కొనాలంటే జంకాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.8.50 పలుకుతోంది. దీంతో రోజుకోసారో, రెండు రోజులకోసారో కోడిగుడ్డును తీసుకొనేవారు ఇక నుంచి వారానికోసారో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. మూడు వారాల నుంచి ధర అమాంతంగా పెరు గుతూ వస్తుంది. అక్టోబర్ నెలలో హోల్‌సేల్‌గా వంద కోడిగుడ్లు ధర రూ.700 నుంచి రూ.750 వరకు ఉంది. ఆ తర్వాత కార్తీక మాసంలో వీటి వాడకం కొంత తక్కువగా ఉండేది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం వంద గుడ్ల ధర రూ.800 నుంచి రూ.850కి హోల్‌సేల్‌గా అమ్ముతున్నారు. డజన్ రూ.95 నుంచి రూ. 105 మేర పలుకుతుండటంతో కొనుగోలుకు వచ్చిన వారు కళ్లు తేలేస్తున్నారు. కోడి మాంసం ధరలు కొంత వరకు తగి రూ.200 నుంచి రూ.220 వరకు కొనసాగుతోంది. గుడ్ల ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతుండటంతో విని యోగదారులు విస్తుపోతున్నారు. కూరగాయల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న టి వరకు అందుబాటులో ఉన్న గుడ్డు ధర పెరగడంతో వినియోగదారులు వామ్మో అంటున్నా రు. హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమాను లు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు.


