ఆదోని బంద్ సంపూర్ణం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం అఖిలపక్ష, జాయింట్ యాక్షన్ కమిటీ, ఆదోని జిల్లా సాధన సమితిల ఆధ్వర్యంలో బుధవారం బంద్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, ప్రకాష్‌జైన్, కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్‌చార్జి దేవిశెట్టి ప్రకాష్, అగ్రి ఫర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ నాయకులు అశోకానందరెడ్డి, బంగారం షాపుల అసోసియేషన్ నాయకులు మద్దతు తెలియజేశారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి భీమాస్ సర్కిల్ వరకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బైకుపై ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి మద్దతు తెలిపారు.


