అడవిని విడిచి బతకలేం
గ్రామాలకు వెళ్లినపుడు అక్కడి వారు చక్కటి ఇళ్లలో జీవించడం చూశాం. మేం అలా ఉండాలనుకుంటున్నం. కానీ అధికారులు అందుకు ఒప్పుకోవడంలేదు. అడవిని విడిచి మేం బతకలేం. ఇళ్లు లేకుండా మా బతుకులు హీనంగా ఉంటున్నాయి. అటవీ అధికారులు అడవితో మాకున్న సెంటిమెంట్‌ను గుర్తించాలి. ఇళ్లు కట్టుకోవడానికి మాకు అనుమతి ఇవ్వాలి.
– నాగన్న ,పెచ్చెర్వు
అడవి నుంచి మమ్మల్ని మైదానాలకు వెళ్లాలంటున్నారు. అప్పుడే అభివృద్ధి అంటున్నారు. ఈ ప్రయోగం 40 ఏళ్ల కిందటే విఫలమైంది కదా? అభివృద్ధి ప్రాంతాలకు మమ్మల్ని తరలించొద్దు. మేమున్న చోటికే అభివృద్ధి ఫలాలు చేరాలి. సమాజంతో సమానంగా మేం ఎదుగుతాం. మాకు పక్కా ఇళ్లు, పాఠశాల, వైద్యం అన్ని చేరువ కావాలి. – నాగరాజు,పెచ్చెర్వు
నాగరిక ప్రపంచానికి దూరంగా గిరిజనులు అడవుల్లో ఉండడంతో అభివృద్ధికి దూరమవుతున్నారు. వారు మైదాన ప్రాంతాలకు వెళితే ప్రభుత్వం సమగ్రాభివృద్ధికి తగు ఏర్పాట్లు చేయనుంది. బయటకు వెళ్లే ప్రతి గిరిజన కుటుంబానికి రూ.15 లక్షలు ఇవ్వనున్నారు. పక్కా ఇళ్ళు, విద్య, వైద్యం అందుబాటులో ఉంచుతారు. – విగ్నేష్ అపావ్, డీడీ ప్రాజెక్ట్ టైగర్,
ఆత్మకూరు డివిజన్, ఎన్‌ఎస్‌టిఆర్
అడవిని విడిచి బతకలేం
అడవిని విడిచి బతకలేం


