ప్రొటక్షన్ వాచర్లకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అవార్డులు
ఆత్మకూరు రూరల్: అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు పాటు పడుతున్న అటవీ శాఖ ప్రొటెక్షన్ వాచర్ల శ్రమకు తగిన గుర్తింపు లభించింది. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులి సంరక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఐదుగురు గిరిజన ప్రొటెక్షన్ వాచర్లకు వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫెడరేషన్ వారు ప్రశంశా పత్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేలు అందించింది. ఎన్‌ఎస్‌టీఆర్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ గుడ్లకమ్మ రేంజ్‌లోని దిగువ మెట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర అటవీ దళాల ప్రధాన అధికారి పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఆత్మకూరు డివిజన్‌కు చెందిన ఈదన్న, గుళ్ల నాగయ్య, మార్కాపురం డివిజన్‌కు చెందిన పులిచర్ల హనుమయ్య, గిద్దలూరు డివిజన్‌కు చెందిన పిచ్చయ్య, నంద్యాల డివిజన్‌కు చెందిన జనార్దన్ నాయక్ ప్రశంసా పత్రాలు, నగదు అందుకున్నారు. ఈ మేరకు ఎన్‌ఎస్‌టీఆర్ ఎఫ్‌డీపీటీ విజయకుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదలేశారు.


