
నాలుగు డీఏలు ఇవ్వాలి
కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులతోముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరుపడం హర్షణీయమే. కాని ఉద్యోగులు ఆశించిన రీతిలో డిమాండ్‌లకు ఆమోదం లభించలేదు. సరండర్ లీవ్‌లు ఒక్క పోలీసులకు మాత్రమే ఇస్తామనడం తగదు. ఇతర ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? పోలీసులతో సమానంగా అందరికీ సరండర్ లీవ్‌లు మంజూరు చేయాలి. ఒక్క డీఏ మాత్రమే ఇవ్వడం దరదృష్టకరం. పెడింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలి. – సర్దార్ అబ్దుల్ హమీద్, ఆల్ ఇండియా డ్రైవర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు