
జీఎస్టీ 2.0పై విస్తృత అవగాహన
● డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్
నంద్యాల: జిల్లాలో జీఎస్టీ 2.0 (సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్) సంస్కరణలపై నెల రోజుల పాటు ప్రజల్లో విస్తృతతంగా అవగాహన కల్పించాలని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారి మురళీ మనోహర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జీఎస్టీ 2.0 (ఉత్సవ్) అవగాహన కార్యక్రమాల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి, జేసీ కొల్ల బత్తుల కార్తీక్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని అన్ని విభాగాల సహకారంతో జీఎస్టీ 2.0పై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. జీఎస్టీ సంస్కరణలు వ్యాపారులు, వినియోగదారుల మధ్య సులభమైన పన్ను విధానం, పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యమని వివరించా రు. గతంలో ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబ్‌లు (5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం)ను సంక్షిప్త పరిచి రెండు స్లాబ్‌లుగా మార్చడం, కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించడం వంటి కీలక మార్పులను ప్రజల కు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 22వ తేదీ నుం,ఇ అమలు చేస్తున్న కొత్త జీఎస్టీ విధానం వల్ల నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పన్ను తగ్గింపుతో ప్రజలకు నేరుగా లాభాలు కలుగుతున్నా యని వివరించారు. ప్రజలలో పన్నుల అవగాహన పెరగడంతో మార్కెట్‌లో పారదర్శకత, వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందన్నారు. అంతకుముందు డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక, జీఎస్టీ అంశంపై విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు.