
‘కూటమి’ నేతలు భయపడుతున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం
రచ్చబండ ద్వారా వాడవాడలా సంతకాలను సేకరిద్దాం
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28న ర్యాలీలు
వచ్చే నెల 12న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు
కల్తీ మద్యం, నాటుసారాకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిద్దాం
మహిళలతో కలసి ఎకై ్సజ్ పోలీస్టేషన్ల ముట్టడికి సిద్ధంగా ఉండాలి
వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కూటమి ప్రభుత్వం ఆదాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌షాప్‌లు, బెల్టు దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా మహిళలతో ఎకై ్సజ్ పోలీస్టేషన్ల ఎదుట రానున్న రోజుల్లో ధర్నా చేపడతామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం ద్వారా వాడవాడలా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహించబోతున్నామని వివరించారు.
బొమ్మలసత్రం: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోన్‌రెడ్డికి తోడుగా వైఎఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమం కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరంచేసి నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలన్నారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్‌హాల్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంథ్రనాధ్‌రెడ్డి ముఖ్యఅతిఽథులుగా, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జ్ దారా సుధీర్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల్పర్పించారు. వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ‘జగనన్న విజన్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అధికారంలోకి వచ్చాక మోసం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని ‘కూటమి’ నేతలు కల్లబొల్లి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘సూపర్ సిక్స్’లో భాగంగా చెప్పిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అందించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. అన్నదాతలు పంటలను రోడ్లపై పడేస్తుండటం చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణ
కల్తీ మద్యం, బెల్టు దుకాణాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలంటే గ్రామ, మండల, నియోజకవర్గాల్లో కమిటీల ద్వారా కార్యకర్తలను కలుపుకుంటూ ఉద్యమబాటను కొనసాగించాలన్నారు. వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణను తలపెట్టాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 28న ర్యాలీలు నిర్వహించాలని, వచ్చే నెల 12న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పల్లె ప్రాంతాల్లో కల్తీ సారాతో, బెల్టు దుకాణాల్లో కల్తీ మద్యంతో పేదల ప్రాణాలు పోతున్నాయని, దీన్ని వ్యతిరేకిస్తూ మహిళలతో కలిసి ఎకై ్సజ్ కార్యాలయాల ముట్టడికి సిద్ధంగా ఉండాలన్నారు.
సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నేతలు
జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎస్‌ఎస్‌ఈసీ మెంబర్లు పీపీ నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథ్‌రెడ్డి, ఆళ్లగడ్డ బాబులాల్, చల్లా విఘ్నేష్‌రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, మలికి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, భూమా కిషోర్‌రెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి , పీపీ మధుసుదన్‌రెడ్డి, రాష్ట్రకార్యదర్శి చల్లా మధుసుదన్‌రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రెటరీలు అబ్ధుల్ రజాక్, మల్లు సురేంద్రనాథ్ రెడ్డి, స్టేట్ వైఎస్సార్‌టీయూసీ జనరల్ సెక్రటరీ మోమిన్ మన్సూర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి
నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీనేతలు
నంద్యాల పట్టణంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి
హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు
ఆదాయం కోసమే కల్తీ మద్యం!
ఎన్నికల ముందు అమలుకు వీలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచిపోవడంతో ‘కూటమి’ నేతలు ప్రజల్లోకి రావాలంటేనే భయపడిపోతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో అసెంబ్లీలో ఒక మాట అసెంబ్లీ బయట మరో మాట చెబుతోందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 12,900 కోట్లు కేంద్రం మంజూరు చేయిస్తే అది కూడా తామే చేశామని టీడీపీ నేతలు ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారన్నారు. రాజకీయాన్ని సేవగా భావించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముందుకు నడవాలన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు.

‘కూటమి’ నేతలు భయపడుతున్నారు