
కుటుంబాలు వీధిన పడుతున్నాయి
అధికార పార్టీ నాయకుల ధన దాహంతో సామాన్య, పేదల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పల్లెల్లో బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయడంతో కొందరు మద్యానికి బానిసలవుతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును మద్యానికి పెట్టాల్సి వస్తోంది. పేదలకు మెరుగైన వైద్యం, విద్యనందించాల్సిన కూటమి ప్రభుత్వం మద్యాన్ని బెల్ట్‌షాప్‌ల ద్వారా డోర్ డెలివరి చేయడం ఎంత వరకు సమంజసం.
– సుమలత సురేష్, వార్డు కౌన్సిలర్, డోన్
కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను నియంత్రిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు దశల వారీగా ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం ఊరూరా బెల్ట్ షాప్‌లు నడపుతుండటం దారుణం. పల్లెల్లో జనావాసాల మధ్య మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం
– పసుల కీర్తి, వైఎస్సార్‌సీపీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షురాలు
●

కుటుంబాలు వీధిన పడుతున్నాయి