
పోటీలతో సృజనాత్మకత వెలికి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
– జనార్దన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల
విద్యార్థులు దేశ భక్తిని చాటేలా వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబరిచేలా ఉపాధ్యాయులు విద్యార్థులను మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే చక్కటి కార్యక్రమం. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
– ప్రేమాంతకుమార్, అదనపు ప్రాజెక్టు
కో ఆర్డినేటర్, సమగ్రశిక్ష, నంద్యాల

పోటీలతో సృజనాత్మకత వెలికి