
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నందికొట్కూరు: ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఖైదీలకు కోర్టు ఉచిత న్యాయ సహాయం అందజేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం పట్టణంలోని సబ్‌జైల్‌ను జడ్జి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌జైల్‌లో నెలకొన్న సమస్యలుంటే న్యాయవాదుల దృష్టికి, ఆన్‌లైన్ నంబరు 15100 ద్వారా కంప్లయింట్ చేయవచ్చని స్పష్టం చేశారు. 70 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన వసతుల గురించి ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు.వైద్య సదుపాయల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబ్‌జైల్ సూపరింటెండెంట్ రఘునాథరెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.