
గౌరవ వేతనాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేసేందుకు చేతులు రావడం లేదు. ముస్లిం, క్రిస్టియన్లకు సూపర్ 10 అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని బలపరిచేది కాదు.
– పీ ఇక్బాల్‌హుసేన్, ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షుడు