
ట్యాబ్‌ల చోరీ నిందితుల అరెస్ట్
నంద్యాల: పట్టణంలోని కేఎన్‌ఎం హైస్కూల్ సమీపంలోని డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ట్యాబ్‌లు చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ తెలిపారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డిప్యూటీ డీఈఓ కార్యాలయంలోని 90 ట్యాబ్‌లు, 60 అడాప్టర్లు, 150 ఓటీజీ కేబుల్స్, రెండు స్పైక్ గార్డ్స్‌లు ఇటీవల చోరీకి గురయ్యాయి. ఏపీ సమగ్ర శిక్షణ అధికారి దస్తగిరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పట్టణంలోని చాంద్‌బాడ వీధికి చెందిన షేక్ హుసేన్‌వలి, ఒక మైనర్ బాలుడు ఈ చోరీకి పాల్పడ్డారని, వీరిని సోమవారం భీమవరం రోడ్డులోని ఈద్గా సమీపంలోని అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి అపహరణకు గురైన రూ.6.93 లక్షలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచామన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.