
న్యాయ సహాయానికి డయల్ 15100
కర్నూలు(హాస్పిటల్): ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే 15100 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి తెలిపారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో ఉన్న దిశ వన్ స్టాప్ సెంటర్, మహిళా ప్రాంగణం(శక్తి సదన్)ను సోమవారం ఆయన తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించి వాటిని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అందరూ అర్హులని తెలిపారు. వన్‌స్టాప్ సెంటర్‌లో ప్రభుత్వం ద్వారా అందజేసే బాధితుల పరిహారానికి సంబంధించి రికార్డులు పరిశీలించి వాటిని త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.