
జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్
నంద్యాల: జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్‌ను నియమిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ షెరాన్ 2019 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఈయన విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అధిరాజ్‌సింగ్‌రాణాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 2024 జూలై నెలలో నంద్యాల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాణా 14 నెలలు పాటు ఇక్కడ పని చేశారు.
పెన్షనర్ల సంఘం ఎన్నికలకు 36 నామినేషన్లు
నంద్యాల(అర్బన్): జిల్లా పెన్షనర్ల సంఘం కార్యవర్గంలోని 17 పదవులకు శనివారం 36 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి పెద్దన్న గౌడ్ తెలిపారు. స్థానిక సంఘం భవనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులతో పాటు ఆరుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు జాయింట్ సెక్రటరీల పదవులకు 36 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 26న ఎన్నికల నిర్వహణను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి ప్రభాకర్, సహాయకులు కిట్టప్ప, తదితరులు పాల్గొన్నారు.
అతిసార వ్యాధితో వ్యక్తి మృతి
రుద్రవరం: కొండమాయపల్లెకు చెందిన గుర్రప్ప (36)అనే వ్యక్తి శనివారం అతిసార వ్యాధితో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రప్ప శుక్రవారం అతిసారం బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు రుద్రవరం, ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. గుర్రప్ప గత 15 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోయి దగ్గరి బంధువుల ఉంటూ పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదని గ్రామస్తులు తెలిపారు.
ఉల్లి గడ్డలతో నిండిపోయిన మార్కెట్
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లిగడ్డలతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. మార్కెట్‌లోని అన్ని షెడ్లు, కమీషన్ ఏజెంటు దుకాణాల ఎదుట ఉల్లి సంచులే కనిపిస్తున్నాయి. రైతులు శనివారం సరుకును తీసుకురాలేదు. ఇది వరకే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లి మార్కెట్ యార్డులో పేరుకపోయింది. మరోవైపు వ్యాపారులు కొనకుండా వదిలేసిన లాట్లు వందలాదిగా ఉండిపోయాయి. దీనిని మార్క్‌ఫెడ్ కొనాల్సి ఉంది. సోమవారం ఉదయం లోపు ఖాళీ అయితేనే రైతులు తెచ్చిన ఉల్లిని అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది. కుళ్లిపోయిన ఉల్లిగడ్డలు గుట్టలుగా ఉండిపోవడం, మార్కెట్ యార్డులో పారిశుద్ధ్యలోపం ఎక్కువ కావడంతో దుర్వాసన వస్తోంది.

జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్

జిల్లా నూతన ఎస్పీగా సునీల్ షెరాన్