
మహిళలపై పెరిగిపోయిన హింస
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస పెరిగింది. మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. మద్యం తాగే వారు ఎక్కువ కావడంతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడి పోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యులు అల్లాడి పోతున్నారు. అయితే అర్ధరాత్రి వరకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయించడం చాలా దారుణం. ఆదాయం గురించి తప్ప ప్రజారోగ్యం గురించి పాలకులు పట్టించుకోకపోవడం విచారకరం.
–శశికళారెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, నంద్యాల
రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ శివారు ప్రాంతాల్లో శ్రామికులు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో మద్యం తాగుతున్నారు. డబ్బులు లేక, నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పేదల ఇళ్లల్లో వృద్ధులు, పిల్లలు పస్తులుండాల్సి వస్తోంది. పిల్లల ఆకలి బాధలు చూడలేక కొందరు మహిళలు కూలీ పనులకు వెళ్తున్నారు. మద్యం విక్రయాలు తగ్గించకుండా అర్ధరాత్రి వరకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం దారుణం.
– సుశీలమ్మ, ఏపీ మహిళా సమాఖ్య
జిల్లా అధ్యక్షురాలు, నంద్యాల
●

మహిళలపై పెరిగిపోయిన హింస