
నల్లమలలో వజ్రాన్వేషణ
నీటి గలగలలు.. తళుక్కుమనే ఆశలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది వజ్రాల కోసం నల్లమల అడవిలోని ఒక వంకలో అన్వేషణ సాగిస్తున్నారు. మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని సర్వనరసింహస్వామి ఆలయం సమీపం వద్ద ఈ దృశ్యం కనిపిస్తోంది. అన్వేషకులకు ఎక్కువగా చెకుముకి రాయి తరహాలో తెల్లగా ఉండే చిన్న చిన్న రాళ్లు దొరుకుతున్నాయి. వజ్రాలు దొరుకుతాయనే నమ్మకంతో ఆంజనేయపురంలోని ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో కొంతమంది, మరికొంత మంది ఇదే గ్రామంలో ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అదృష్టం వరించిన వారికి సుమారు రూ. లక్షకు పైగా విలువ చేసే వజ్రాలు దొరికినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల చీరాల నుంచి వచ్చిన ఓ మహిళకు రూ.1.50లక్షల విలువైన వజ్రం దొరికింది. ఇక్కడికి ప్రకాశం, గుంటూరు, విజయవాడ, బాపట్ల తదితర జిల్లాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. – మహానంది
ఒక వ్యక్తికి
దొరికిన రాయి