
ఉపాధి అవకాశాలకు ప్రణాళికలు రూపొందించండి
నంద్యాల: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళిక రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం డిస్టిక్ స్కిల్ డెవలప్‌మెంట్ (జిల్లా నైపుణ్యాభివృద్ధి) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఆసక్తి ఉన్న రంగా ల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశా లు కల్పించే దిశగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే కోర్సులను గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలోని పెద్ద పెద్ద పరిశ్రమలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులను తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ ిపీడీ శ్రీధర్ రెడ్డి, జీఎం ఇండస్ట్రియల్. ఐటీడీ ఏఏపిఓ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ సీడ్ ఆప్ సిబ్బంది పాల్గొన్నారు.