
నేటి నుంచి బేతంచెర్లలో ఆగనున్న ‘కొండవీడు’
బేతంచెర్ల: మచిలీపట్నం – యశ్వంతపూర్ మధ్య నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ బుధవారం నుంచి బేతంచెర్ల రైల్వే స్టేషన్‌లో ఆగనుంది. కరోనా సమయంలో తీసేసిన స్టాపేజ్‌ను పునురుద్ధరించారు. మచిలీపట్నం నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైలు (17211) బేతంచెర్లలో బుధవారం రాత్రి 12.34 గంటలకు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు (యశ్వంత్‌పూర్ – మచిలీపట్నం 17212) 11వ తేదీ నుంచి రాత్రి 9.19 గంటలకు ఆగుతుంది. బేతంచెర్లలో స్టాపేజ్ పునురుద్ధరించంతో విజయవాడ – బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండనుంది. ఇందుకు కృషి చేసిన ఎంపీ బైరెడ్డి శబరికి బేతంచెర్ల ప్రజలు, ప్రజా సంఘాలు వ్యాపార, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు కృత్ఞతలు తెలిపారు.
శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 208.2841 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 883.70 అడుగులకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జలాశయానికి 1,30,011 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. రేడియల్ క్రస్ట్‌గేట్లను మూసివేసినప్పటికీ జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 1,61,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 55,355 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 69,901 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 32,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,824 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపో తలకు 1,600 క్యూసెక్కుల నీటిని వదిలారు.
తనయుడి బ్రహ్మోత్సవాలకు తండ్రి తరఫున పట్టువస్త్రాలు
మహానంది: కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది దేవస్థానం తరపున మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు, వేదపండితులు కాణిపాకం క్షేత్రానికి చేరుకుని సంప్రదాయ బద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. గత కొన్నేళ్లుగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పట్టు వస్త్రాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టువస్త్రాలను సమర్పించిన మహానంది ఈఓ, పండితులు, అర్చకులు, సిబ్బందిని కాణిపాకం ఆలయ అధికారులు, పండితులు సన్మానించి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించారు.
ఎయిడ్స్ నివారణకు కృషి చేయాలి
గోస్పాడు: ఎయిడ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఏపీఎస్‌ఏసీఎస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ) తరపున, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు, విద్యాశాఖ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, 108, ఎన్‌జీఓస్ సహకారంతో ఎయిడ్స్ నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా యూత్ ఫెస్ట్ 2025 మరథాన్ 5 కి.మీ రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎయిడ్స్ పట్ల యువత అప్రమ త్తంగా ఉండాలన్నారు. సమాజంలో యువత భా గస్వామి అయి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్‌రన్‌లో పురుషుల విభాగంలో విజయరాజు మొదటి బహుమతి సాధించగా సురేష్‌నాయుడు రెండో బహుమతి, మహిళల విభాగంలో అనూష మొదటి బహుమతి, ప్రసన్న రెండో బహుమతి, ట్రాన్స్‌జెండర్‌లో శ్రీలేఖ మొదటి బహుమతి, వినీత్‌గౌడ రెండో బహుమతి సాధించగా బహుమతులు అందజేశారు.

నేటి నుంచి బేతంచెర్లలో ఆగనున్న ‘కొండవీడు’

నేటి నుంచి బేతంచెర్లలో ఆగనున్న ‘కొండవీడు’