
అడుగడుగునా ఆంక్షలు
నిరసనలతో దద్దరిల్లిన నంద్యాల, ఆత్మకూరు, డోన్
కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
యూరియా ఇంకెప్పుడు ఇస్తారంటూ మండిపాటు
రైతులను విస్మరిస్తే అధోగతినని
రైతుల శాపనార్థాలు
అన్నదాత పోరు విజయవంతం అవుతుందని భయపడిన కూటమి నేతలు పోలీసులతో అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని రైతులు తిప్పికొట్టారు. 30 యాక్ట్ అమలు చేసి ర్యాలీలను అడ్డుకోవాలని చూసింది. డోన్‌లో అధిక వాహనాలతో వెళ్లరాదని, బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించరాదని పోలీసులు షరతులు విధించారు. కేవలం 20 మందికి మాత్రమే ఆర్టీఓకు వినతి ప్రతం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. ప్రభు త్వం అన్నదాత పోరు ఆందోళనను అణిచివేసేందుకు ఎన్ని ఆంక్షలు విధించినా అన్నదాతలు కదలివచ్చారు. డోన్, బనగానపల్లె ప్రాంతాల నుంచి భారీగా రైతులు తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం గమనార్హం.
వైఎస్సార్‌సీపీ ‘అన్నదాత పోరు’లో గర్జించిన రైతులు