
టీడీపీ నాయకులు బేస్ మట్టాలు కూల్చివేస్తున్నారు
డోన్ టౌన్: ఇళ్లు నిర్మించుకుంటున్న క్రమంలో టీడీపీ నాయకులు ఇళ్ల బేస్‌మట్టాలను కూల్చేసి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పట్టణ సమీపంలోని మార్కెట్‌యార్డు ఎదురుగా ఉన్న కోట్ల హరిసర్వోత్తమరెడ్డి కాలనీలో ఉన్న 510 సర్వే నంబరులో 2007లో అప్పటి ప్రభుత్వం 120 మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసింది. కొందరు ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా మరికొందరు ఆర్థిక స్తోమత లేకపోవడంతో బేస్‌మట్టం వరకు నిర్మించుకుని మధ్యలో నిలిపేసుకున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు టీడీపీ నాయకులు వాటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు రమిజాబీ, మహబూబ్‌సాహెబ్, బాబులాల్, సుధాకర్ తదితర బాధితులు ఆదివారం ఆరోపించారు. కబ్జాదారులు తమ అర్ధరాత్రి ఇళ్ల వద్దకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

టీడీపీ నాయకులు బేస్ మట్టాలు కూల్చివేస్తున్నారు