
విష జ్వరాలపై కదిలిన యంత్రాంగం
కోవెలకుంట్ల: విష జ్వరాలపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం లోపించి దోమల కారణంగా ప్రజలు విష జ్వరాలు బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని ‘డెంగీ లక్షణాలతో ఆసుపత్రుల్లో చికిత్స’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ పవనకుమార్‌రెడ్డి సోమవారం పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకుని చికిత్ప పొందుతున్న జ్వరపీడితులను పరామర్శించారు. సీహెచ్‌సీ ఇన్‌చార్జ్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగీ లక్షణాలతోపాటు వైరల్ ఫీవర్స్‌తో బాధపడుతున్న మహిళలు, చిన్నారులకు సకాలంలో వైద్య సేవలందిస్తున్నట్లు తహసీల్దార్‌కు డాక్టర్ వివరించారు. మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీ డాక్టర్ రాబర్ట్ కెన్నెడి జ్వరాలతో బాధపడుతున్న 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మేజర్ పంచాయతీ ఈఓ ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో స్వామినగర్, ఎల్‌ఎం కాంపౌండ్, గాంధీనగర్, పూసలవీధి, తదితర ప్రాంతాల్లో దోమలు నివారణకు క్రిమి సంహారక మందు పిచికారీ చేయించారు.

విష జ్వరాలపై కదిలిన యంత్రాంగం