కర్నూలు(అర్బన్): బ్రాహ్మణులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోలూరు సతీష్, ప్రధాన కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు, జిల్లా నాయకులు దుర్గం బాలాజీ కోరారు. వారు ఆదివారం మాట్లాడుతూ.. బ్రాహ్మణులు సాంప్రదాయ వృత్తులు, అర్చకత్వం ఆధారంగా జీవనం సాగిస్తున్నప్పటికీ, ఆధునికత ఆన్‌లైన్ సేవల విస్తరణతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్రాహ్మణులకు విద్య, ఉపాధి అవకాశాల్లో తగిన మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ బోర్డు ద్వారా కొంత మేర చర్యలు తీసుకున్నా, అవి పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలన్నారు.