
రేపు రైతుల కోసం అన్నదాత పోరు
బొమ్మలసత్రం: యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి నివాసంలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియాను అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతన్నలకు ఏ కష్టం రాకుండా అండగా నిలిచారన్నారు. అన్నదాతల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అన్నదాత పోరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరరు ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్, మాజీ ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, సాదిక్‌బాషా, చంద్రశేఖర్‌రావు, జిల్లా ప్రదాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షులు టైలర్ శివయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కారువరికుమార్, లీగల్‌సెల్ అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి, జిల్లా సెక్రటరీ హరి, నాయకులు జాకీర్ హుస్సేన్, సుబ్బరాయుడు, సాయిరామ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, సుధాకర్, రత్నబాబు చౌదరి పాల్గొన్నారు.