
మహానంది ఆలయం మూసివేత
మహానంది: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మహానంది ఆలయ తలుపులు మూసేశారు. ముందుగా వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బింబ సంరక్షణార్థం దర్భకూర్చలు, దర్భ పవిత్రములు సమర్పించి ఆలయ తలుపులు మూశారు. ఏఈఓ ఎరమల మధు ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశింకరశర్మ, ముఖ్య అర్చకులు పూజలు చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు. సోమవారం ఉదయం తలుపులు తీసి సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శన భాగ్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.